Site icon HashtagU Telugu

Viral News: వాచ్ ను ఆర్డర్ చేస్తే.. పిడకలు పంపారు!!

Cow Dung Imresizer

Cow Dung Imresizer

ఫ్లిప్‌కార్ట్ లో వాచ్ ను ఆర్డర్ పెట్టిన మహిళకు.. పిడకలు పంపించారు. దాంతో ఆమె ఒక్కసారిగా అవాక్కైంది. ఆమె సోదరుడు కూడా ఆశ్చర్యపోయాడు. వెంటనే డెలివరీ బాయ్‌ను పట్టుకుని.. విషయం చెప్పాడు. ఎక్కడో పొరపాటు జరిగిందని.. డెలివరీ బాయ్ ఆ ప్యాకెట్‌ను వెనక్కి తీసుకున్నాడు. డబ్బులు వెనక్కి ఇచ్చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా కాసెండా గ్రామంలో జరిగింది.

కాసెండా గ్రామానికి చెందిన నీలం యాదవ్ ఫ్లిప్‌కార్ట్‌లో Big Billion Days ఆఫర్‌లో సెప్టెంబర్ 28న రూ.1,304ల ఓ వాచ్‌ను ఆర్డర్ చేసుకుంది. క్యాష్ ఆన్ డెలివరీని ఆప్షన్ ఎంచుకుంది. దాని కోసం ఎంతగానో ఎదురుచూసింది.
కరెక్ట్‌గా తొమ్మిది రోజుల తర్వాత అక్టోబర్ 7న డెలివరీ వచ్చింది. ఆన్‌లైన్‌లో వాచ్‌కు చూపించిన ధర రూ.1,304లను నుంచి చెల్లించి.. ఆ ప్యాకెట్‌‌ను తీసుకుంది. ఎంతో ఆసక్తితో దానిని ఓపెన్ చేసిన నీలం షాక్ అయింది. ఎందుకంటే ఆ ప్యాకెట్‌లో వాచ్ లేదు.. చిన్న సైజులో ఉన్న పిడకలు ఉన్నాయి.

ఇంకొన్ని ఘటనలు..

ఇలాంటి సంఘటనలు ఈ మధ్య తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలె ఇలాంటి సంఘటన ఇంకొకటి జరిగింది. ఐఫోన్ ఆర్డర్ పెడితే.. సబ్బులు వచ్చాయి. సిమ్రన్‌పాల్ సింగ్ అనే వ్యక్తి ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12 ఆర్డర్ పెట్టగా అతనికి రెండు బార్ల నిర్మా సబ్బులు వచ్చాయి. దాంతో అతను ఆ వీడియోని యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. తర్వాత ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్‌‌ ప్రతినిధులకు సింగ్ కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. దాంతో ఫ్లిప్ కార్ట్‌ తమ తప్పును అంగీకరించింది. కంపెనీ ఆ ఫోన్ ఆర్డర్‌ని కూడా రద్దు చేసింది. దాని కోసం కస్టమర్‌కు రీఫండ్ కూడా చేసింది. ఇదే కాదు ఒకరు ట్యాప్ ఆర్డర్ చేస్తే సబ్బులు పంపించిన ఘటన కూడా చోటుచేసుకుంది.