Site icon HashtagU Telugu

Spicejet Offer: రూ.1818కే విమాన టికెట్.. రూ.3 వేల కూపన్.. ప్రయాణికులకు స్పైస్‌జెట్ స్పెషల్ ఆఫర్!

Whatsapp Image 2023 05 23 At 21.00.10

Whatsapp Image 2023 05 23 At 21.00.10

Spicejet Offer: స్పైస్‌జెట్ 18వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.1818కే విమాన టికెట్ ధరను అందిస్తోంది. ఆన్‌లైన్‌లోనే రూ.1818కే టకెట్‌ను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. అలాగే 18 ఏళ్లు పైబడిన వారికి ప్రత్యేక డిస్కౌంట్ కూపన్ ను ఇస్తోంది. చాలా తక్కువ ధరకే టికెట్ ను అందిస్తుండటంతో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశముంది.

అయితే బెంగళూరు-గోవా, ముంబై-గోవా మధ్య మాత్రమే తక్కువ ధరకు టికెట్ అందిస్తోంది. మే 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు జులై 1 నుంచి మార్చి 2024 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. ఇక ఈ ఆఫర్ తో పాటు మరకొన్ని డిస్కౌంట్లను కూడా స్పైస్ జెట్ ప్రకటిస్తోంది. 18 ఏళ్లు పైబడిన వారు లేదా 18వ బర్త్ డే సెలబ్రెట్ చేసుకునే ప్రయాణికులకు రూ.3 వేల ఉచిత ఫ్లైట్ వోచర్ ను అందిస్తోంది.

రూ.3 వేల విలువైన కూపన్ పొందాలంటటే జూన్ 140వ తేదీలోపు స్పైస్‌జెట్‌కు మీ వివరాలను ఈ మెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. వాళ్లు నిర్ధారించుకున్న తర్వాత జులై 10 వరకు కూపన్ పంపతారు. ఈ కూపన్ ఉపయోగించుకుని ఆగస్టు 31వ తేదీలోపు టికెట్ బుక్ చేసుకుని సెప్టెంబర్ 30లోపు ప్రయాణించాల్సి ఉంటుంది. రూ.7 వేలకుపైగా ధర ఉన్న టికెట్ కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తోంది.
అలాగే ఈ ఆఫర్ తో పాటు స్పైస్‌మ్యాక్స్ ద్వారా బుక్ చేసుకున్నవారికి 50 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే విమానంలో ఇష్టమొచ్చిన సీటును రూ.18 చెల్లించి బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే స్పైస్‌జెట్ 2005వ సంవత్సరంలో మే 23న తొలి విమాన సర్వీస్ ను ప్రారంభించింది. డిల్లీ-అహ్మదాబాద్ మధ్య దీనికి ప్రారంభించారు.