Flight Crash: విమానంలో చెలరేగిన మంటలు.. 126 మంది సేఫ్!

126 మంది వ్యక్తులతో వెళ్తున్న విమానం మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.

  • Written By:
  • Updated On - June 22, 2022 / 05:07 PM IST

126 మంది వ్యక్తులతో డొమినికన్ రిపబ్లిక్ ఎయిర్ క్యారియర్ రెడ్ ఎయిర్‌కు చెందిన విమానం మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ల్యాండింగ్ సమయంలో జెట్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రజలు కేకలు వేస్తూ పారిపోయారు. ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ గా మారాయి. మియామీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరిన రెడ్ ఎయిర్ విమానంలో ల్యాండింగ్ గేర్ కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. దాంట్లో 126 మంది ప్రయాణికులున్నారు. వాళ్లలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇతర ప్రయాణికులను సురక్షితంగా విమానం నుంచి టెర్మినల్‌కు బస్సులో తరలించారు.