Site icon HashtagU Telugu

Empty Chips Packets: విలువైన వస్తువులు ఖాళీ చిప్స్ ప్యాకెట్ లో పెడితే ఏం జరుగుతుందో తెలుసా?

Empty Chips Packets

Empty Chips Packets

మనం ఏదైనా శుభకార్యాలకు ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు చాలామంది బంధువులు కుటుంబ సభ్యులు వస్తూ ఉంటారు. ఇక పెళ్లిళ్లలో సందడి ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. అయితే అటువంటి సమయంలో డబ్బులు బంగారు ఆభరణాలు విలువైన వస్తువులను ఎవరికి కనిపించకుండా జాగ్రత్తగా దాచి పెడుతూ ఉంటారు. గుంపులో గోవిందా అని దొంగతనం చేస్తారేమో అని భయం. ముఖ్యంగా బంగారు ఆభరణాలు వంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అలా అని వాటి చుట్టే కాపలా కాస్తూ కూర్చోలేము. కాబట్టి అటువంటి సమయంలో ఏం చేయాలి అన్న విషయాన్ని ఒక చక్కటి పరిష్కారం చెప్పారు ఫ్లైట్ అటెండెంట్.

అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఫ్లైట్‌ అటెండెంట్‌ మైగుల్‌ మనోజ్‌ ఇటీవల సోషల్‌ మీడియాలో విలువైన వస్తువులు చోరీ కాకుండా ఉండేందుకు ఒక ఆశ్చర్యకరమైన లైఫ్‌ హ్యాక్‌ తెలియజేశారు. ఇది అందరికీ ఎంతగానో ఉపకరిస్తుంది. మన దగ్గరున్న విలువైన వస్తువులను కాపాడుకునేందుకు ఖాళీ చిప్స్‌ ప్యాకెట్స్‌ మన దగ్గర ఉంచుకోవాలని అయన సలహా ఇచ్చారు. నిజానికి మనం ఖాళీ చిప్స్‌ ప్యాకెట్లను చెత్తగా భావించి, బయటపార వేస్తుంటాం. అయితే విలువైన వస్తువులను ఎవరూ గుర్తించలేని చోట పెట్టాలని ఆయన సలహా ఇచ్చారు. తాను చిప్స్‌ ప్యాకెట్‌ లైఫ్‌ హ్యాక్‌ను ఫాలో చేస్తానని చెప్పిన ఆయన తాను ఏదైనా హోటల్‌లో బస చేసినప్పుడు ఖాళీ చిప్స్‌ ప్యాకెట్లలో విలువైన వస్తువులను దాచివుంచుతానని అన్నారు.

దాంతో ఎవరూ కూడా విలువైన వస్తువులు ఖాళీ చిప్స్‌ ప్యాకెట్లలో ఉంటాయనే విషయాన్ని అంచనా వేయలేరని ఆయన అన్నారు. సాధారణంగా చోరీకి పాల్పడేవారు అల్మరాలు, సూట్‌ కేసులు, బ్యాగులను, పర్సులను గమనించి వాటిని తస్కరించే ప్రయత్నం చేస్తారు. సాధారణంగా విలువైన వస్తువులు అక్కడే ఉంటాయనే భావనతో చోరులు వాటిపై కన్ను వేస్తారు. అయితే ప్రయాణ సమయంలో లేదా వేడుకల సమయంలో ఖాళీ చిప్స్‌ ప్యాకెట్‌ లేదా ఖాళీ టిన్‌లలో విలువైన వస్తువులను ఉంచితే దొంగలు వాటిని పసిగట్టలేరు. ఫలితంగా మన విలువైన సామాను సురక్షితంగా ఉంటుంది. కాగా మైగుల్‌ మనోజ్‌ సోషల్‌ మీడియాలో ఇచ్చిన ఈ సలహా చాలామందికి నచ్చలేదు.

Exit mobile version