తెలంగాణలోని ఘట్కేసర్ గట్టు మైసమ్మ జాతర (Gattu Maisamma ) సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ (Flexi ) ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Medial) వైరల్ అవుతోంది. ప్రత్యేకంగా దీనిలో తెలుగు రాష్ట్రాల ప్రముఖ నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో పాటు కొన్ని ఆసక్తికరమైన క్యాప్షన్లు పెట్టడం అందరినీ ఆకర్షించాయి. ఈ ఫ్లెక్సీ చూసిన ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు.
Hands In Pockets : జేబులో చేతులు పెట్టుకుని నడవడం వెనుక ఇంత అర్థం ఉందా..!
ఈ ఫ్లెక్సీలో చంద్రబాబు నాయుడు ఫొటోకు “బాస్ ఈజ్ బ్యాక్” అని, పవన్ కళ్యాణ్ ఫొటోకు “ట్రెండ్ సెట్టర్” అని, కేసీఆర్‌కు “గాడ్ ఆఫ్ తెలంగాణ కమింగ్ సూన్” అని, కేటీఆర్ ఫొటోకు “ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ” అని క్యాప్షన్లు రాశారు. అభిమానుల ఆలోచనలకు అద్దం పట్టేలా ఈ క్యాప్షన్లు ఉండడం విశేషం. అలాగే ఇందులో సీనియర్ ఎన్టీఆర్, లోకేశ్, చిరంజీవి, హరీశ్ రావు ఫొటోలు కూడా ఉండటం మరింతగా మాట్లాడుకునేలా చేస్తుంది. దీనిని ఏర్పాటు చేసిన అభిమానుల ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇలాంటి ఫ్లెక్సీ ఏర్పాటు చేసారనేది ఆసక్తికరంగా మారింది. ఒకే ఫ్లెక్సీలో ఇంతమంది ప్రముఖుల ఫొటోలు ఉండడం చాలా అరుదైన విషయమని అంత భావిస్తున్నారు. ఈ ఫ్లెక్సీ ఇప్పుడు వైరల్ కావడం, తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో ఫొటోను చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.