CM YS jagan : ఐదేళ్లు పూర్తి చేసుకున్న జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌

ఏపీ రాజ‌కీయాల్లో వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ చేసిన పాద‌యాత్ర చ‌రిత్ర సృష్టించింది. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల తెలుసుకునేందుకు

Published By: HashtagU Telugu Desk
Baahubali Sketch

Jagan Imresizer

ఏపీ రాజ‌కీయాల్లో వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ చేసిన పాద‌యాత్ర చ‌రిత్ర సృష్టించింది. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల తెలుసుకునేందుకు చేప‌ట్టిన ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించి నేటితో ఐదేళ్లు పూర్త‌యింది. 2017 నవంబర్‌ 6న కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్‌ వద్ద జగన్‌ పాదయాత్రను మొదలుపెట్టారు. 14 నెలలపాటు సుదీర్ఘంగా 13జిల్లాల్లో ఈ పాద‌యాత్ర కొన‌సాగింది. మొత్తం 3వేల 648 కిలోమీటర్లు జగన్‌ నడిచారు. 13జిల్లాలు, 134నియోజకవర్గాలు, 231మండలాల పరిధిలోని 2వేల 516 గ్రామాలు, 62 నగరాలు, పట్టణాల్లో జగన్‌ పర్యటించారు. 124 భారీ బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు.దాదాపు రెండు కోట్లమంది ప్రజలతో మమేకమయ్యారు. 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో పాదయాత్రను ముగిస్తూ పైలాన్‌ను ఆవిష్కరించారు. ప్రజా సంకల్ప యాత్ర ముగిశాక వచ్చిన ఎన్నికల్లో 151 శాసనసభ, 22 లోక్‌సభా స్థానాల్లో విజయం సాధించారు. మే 30న వైఎస్‌ జగన్ సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు.

  Last Updated: 06 Nov 2022, 09:28 AM IST