AP Assembly: ఐదుగురు టీడీపీ నేతల పై సస్పెన్షన్ వేటు..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యులను సస్పెన్షన్‌ చేశారు. అసెంబ్లీలో సభా కార్యాకలాపాలకు అడ్డు తగులుతున్నారనే కారణంతో స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఐదుగురు టీడీపీ సభ్యులపై వేటు వేశారు. ఈ క్ర‌మంలో అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, పయ్యావు కేశవ్, నిమ్మల రామానాయుడు, బాలవీరాంజనేయులును ఈ బడ్జెట్ సెషన్ నుంచి పూర్తిగా సస్పెండ్ చేస్తున్నట్లుగా స్పీకర్ ప్రకటించారు. ఈ క్ర‌మంలో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, సభలో టీడీపీ సభ్యులు […]

Published By: HashtagU Telugu Desk
Ap Assembly Tdp Mlas Suspended

Ap Assembly Tdp Mlas Suspended

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యులను సస్పెన్షన్‌ చేశారు. అసెంబ్లీలో సభా కార్యాకలాపాలకు అడ్డు తగులుతున్నారనే కారణంతో స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఐదుగురు టీడీపీ సభ్యులపై వేటు వేశారు. ఈ క్ర‌మంలో అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, పయ్యావు కేశవ్, నిమ్మల రామానాయుడు, బాలవీరాంజనేయులును ఈ బడ్జెట్ సెషన్ నుంచి పూర్తిగా సస్పెండ్ చేస్తున్నట్లుగా స్పీకర్ ప్రకటించారు. ఈ క్ర‌మంలో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, సభలో టీడీపీ సభ్యులు హుందాగా వ్యవహరించాలన్నారు.

ఇక సస్పెండ్ చేసిన ఐదుగురు టీడీపీ సభ్యులు తక్షణం బయటకు వెళ్లిపోవాలని స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఆదేశించగా, టీడీ స‌భ్యులు బ‌య‌ట‌కు వెళ్ళేందుకు ససేమిరా అన్నారు. స‌భ‌లో తాము ఏం తప్పు చేశామని స్పీక‌ర్‌ను టీడీపీ నేత‌లు ప్రశ్నించారు. దీనిపై స్పీకర్ త‌మ్మినేని స్పందిస్తూ రాష్ట్ర బడ్జెట్‌కి సంబంధించిన విలువైన చర్చా సమయాన్ని వృదా చేశారని, ప‌లు కీల‌క అంశాల‌పై చర్చ జరగకుండా అడ్డుకున్నారని త‌మ్మినేని అన్నారు. అలాగే స‌భ‌లో ఇతర సభ్యుల హక్కులను ఉల్లంఘించారని టీడీపీ నేత‌ల పై త‌మ్మినేని అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో టీడీపీ నేత‌ల చేష్ట‌లు రాష్ట్ర ప్ర‌జ‌లు చూస్తూనే ఉన్నార‌ని త‌మ్మినే సీతారం అన్నారు.

  Last Updated: 14 Mar 2022, 03:02 PM IST