ఏపీలో విషాదం చోటుచేసుకుంది. విజయవాడలోని యనమలకుదురు సమీపంలోని కృష్ణా నదిలో ఈతకు దిగిన ఐదుగురు విద్యార్థులు (Five students Drown) గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహాన్ని గుర్తించారు. మరో నలుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ బృందం ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చేపట్టారు. తొలుత ఒక విద్యార్థి నీటిలో మునిగిపోతుండగా అతని కాపాడటానికి ప్రయత్నించే క్రమంలో నలుగురు విద్యార్థులు నీటమునిగారని (Drown) ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. బాధితులంతా విజయవాడ పడమట ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది విద్యార్థుల ఆచూకీ కోసం వెతుకుతున్నారు.
Also Read: Delhi Incident : విద్యార్థినిని మొదటి అంతస్తు నుంచి విసిరేసిన టీచర్..