ములుగు జిల్లా గట్టమ్మ ఆలయం వద్ద శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వేగంగా వస్తున్న కారు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న వారు మేడారం గిరిజన పుణ్యక్షేత్రానికి వెళ్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. హనమకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హన్మకొండకు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా ములుగు సమీపంలోని గట్టమ్మ దేవాలయం వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మేడారం వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయని, ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని సమాచారం.
Mulugu: ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు దుర్మరణం!

Mulugu