తమిళనాడులోని కడలూరు జిల్లాలో తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఆరు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి (Five Died) చెందినట్లు పోలీసులు తెలిపారు. ఢీకొన్న ఘటనలో రెండు ప్రైవేట్ బస్సులు, రెండు లారీలు, రెండు కార్లు ఉన్నాయి. కారులో నుంచి మృతదేహాలను వెలికితీసి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వేప్పూర్ అగ్నిమాపక సిబ్బంది సహాయంతో కారులోంచి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Also Read: Food Delivery Boy: ఆర్డర్ లేట్ గా తెచ్చాడని ఫుడ్ డెలివరీ బాయ్‌పై దాడి
అయితే మృతులు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. “మృతులను గుర్తించలేకపోయాం. కానీ కారు రిజిస్ట్రేషన్ ప్రకారం వాహనం చెన్నైలోని నంగనల్లూర్‌కు చెందినది. తదుపరి విచారణ జరుగుతోంది” అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.