Site icon HashtagU Telugu

Train Mishap: బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం.. ఐదుగురి మృతి!

train accident

train accident

బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పాట్న నుండి గౌహతి వెళ్తోన్న గౌహతి బికనీర్ ఎక్స్ ప్రెస్ బెంగాల్ లోని మైనాగురి సమీపంలో పట్టాలు తప్పింది. ప్రమాదసమయంలో 40 కిలోమీటర్ల వేగంతో వెళ్లినట్లు అధికారులు తెలిపారు.

ప్రమాదంలో ఆరు బోగీలు తలకిందులై మరో ఆరు బోగీలు దెబ్బతిన్నాయి. ఇందులో ఐదుగురు మరణించగా ఇరవై మందికిపైగా గాయాలయ్యాయి. గాయపడినవారిని దగ్గర్లోని హాస్పిటల్ కి తరలించారు. రైలులోని బోగీలు బోల్తా కొట్టగానే రైలు పట్టాలు తప్పి ఉంటుందని భావించి ట్రైయిన్ నుండి దూకామని రైలు ప్రయాణికులు తెలిపారు.

రైలు ప్రమాదంపై ప్రధాని విచారం వ్యక్తం చేశారు. రైలు ప్రమాదంపై బెంగాల్ సీఎం తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని మమత అధికారులను ఆదేశించారు.