Site icon HashtagU Telugu

5 Killed : గుజ‌రాత్‌లో విషాదం.. కృష్ణ‌సాగ‌ర్ స‌ర‌స్సులో ప‌డి ఐదుగురు చిన్నారులు మృతి

Death Representative Pti

Death Representative Pti

గుజరాత్‌లోని బొటాడ్ జిల్లాలోని విషాదం చోటుచేసుకుంది. కృష్ణసాగర్ సరస్సులో శనివారం ఐదుగురు చిన్నారులు మునిగి చనిపోయారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఇద్దరు పిల్లలు సరస్సులో ఈత కొడుతుండగా వారు మునిగిపోయారని.. అక్క‌డే ఉన్న మరో ముగ్గురు చిన్నారులను కాపాడేందుకు సరస్సులోకి దూకారు. అయితే వారు కూడా మునిగిపోయారు. మృతులంతా మైనర్లే. సాయంత్రం 4:30 గంటల సమయంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టినా చిన్నారులను రక్షించలేకపోయారు. మృతులు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.