Nalgonda: హరిత చైతన్యం.. 50 ఏళ్ల 5 వృక్షాల రీలొకేషన్!

వృక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. ఈ మాట ను ఆచరించి చూపి అందరికీ ఆదర్శంగా నిలిచాయి "గ్రీన్ ఇండియా ఛాలెంజ్"

  • Written By:
  • Publish Date - April 26, 2022 / 06:30 PM IST

వృక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. ఈ మాట ను ఆచరించి చూపి అందరికీ ఆదర్శంగా నిలిచాయి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” , “వట ఫౌండేషన్” సంస్థలు. తాజాగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బై పాస్ వద్ద రోడ్డు విస్తరణ పనుల సందర్భంగా 50 ఏళ్ల కు పైబడిన 5 మహా వృక్షాలను వేళ్ళతో సహా పెకిలించారు. అయితే వాటిని యధావిధిగా తీసుకెళ్లి చర్లపల్లిలోని అర్బన్ పార్కులోకి తరలించే బాధ్యతను “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” , “వట ఫౌండేషన్” సంస్థలు తీసుకున్నాయి. ఇందుకోసం “వట ఫౌండేషన్” కు చెందిన 15 మంది వలంటీర్లు కృషి చేశారు. 50 టన్నుల సామర్ధ్యం కలిగిన క్రేన్ తో ఆ 5 వృక్షాలను పెకిలించి.. ట్రక్కులోకి ఎక్కించి పార్కులో దింపారు. అక్కడ వాటిని మళ్లీ నాటారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కు చెందిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ సహాయం అందించిందని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వెల్లడించారు.