AP News: మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దు

  • Written By:
  • Publish Date - December 4, 2023 / 12:51 PM IST

AP News: మిగ్‌జాం తుపాను గంటకు 14కి.మీ వేగంతో ముందుకు కదులుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ తుపాను బంగాళాఖాతంలో వాయవ్య దిశగా కదులుతున్నట్లు వెల్లడించింది. చెన్నైకి 130కి.మీ, నెల్లూరుకు 220కి.మీ. బాపట్లకు 330కి.మీ, మచిలీపట్నానికి 350కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్లు తెలిపింది.

నేడు కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనున్న తుపాను.. మంగళవారం మధ్యాహ్నం నాటికి తీవ్ర తుపానుగా మారి నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించింది.