Site icon HashtagU Telugu

Bhadradri:చేపల లారీ బోల్తా…ఎగబడ్డ జనం..!!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఐటీసీ క్రాస్ రోడ్డు దగ్గర చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలయ్యాయి. ప్రభుత్వాసుపత్రికి తరిలించి చికిత్స అందిస్తున్నారు. బోల్తాపడిన లారీ వద్ద చేపల కోసం స్థానికులు బారులు తీరారు. ట్రాఫిక్ జామ్ అవుతుందని పోలీసులు మొత్తుకున్నా…ఏమాత్రం పట్టించుకోలేదు జనాలు. దాదాపు రెండు కేజీల బరువు ఉండే సుమారు నాలుగు వేల చేపలు ఉన్న లారీ లోడ్ ను అర్థగంటలోనే ఖాళీ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రలోని నాగ్ పూర్ వైపు వెళ్తుండగా లారీ ప్రమాదానికి గురైంది.

కాగా బుధవారం మృగశిరకార్తె కూడా కావడంతో స్థానికులు చేపల కోసం ఎగబడ్డారు. ఒకర్నిఒకరు తోసుకుంటూ చేపల్నీ పట్టుకెళ్లారు. లారీని లేపేందుకు ప్రయత్నిస్తుంటే…ఓవైపు జనాలు సంతోషం చేపలను సంచుల్లో వేసుకుని వెళ్లారు. లారీలో ఒక్క చేప కూడా మిగలకుండా చేశారు.

 

Exit mobile version