Site icon HashtagU Telugu

Dowleswaram : దౌలేశ్వరం బ్యారేజీ వద్ద మొద‌టి ప్ర‌మాద హెచ్చ‌రిక జారీ

Dowleswaram barrage

Dowleswaram barrage

దౌలేశ్వరం సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజీకి భారీగా వ‌ర‌ద నీరు వ‌స్తుంది. గ‌త వారం రోజుల‌గా భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో ఎగువ నుంచి భారీగా వ‌ర‌ద నీరు ప్రాజెక్టులోకి వ‌చ్చి చేరుతంది. దీంతో ఈ రోజు (గురువారం) ఉదయం 6 గంటలకు గోదావరి నీటి మట్టం 11.75 అడుగులకు చేరింది. దీంతో మొద‌టి ప్ర‌మాద హెచ్చరిక జారీ చేశారు. ఈ సమయంలో 10,02,425 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. డెల్టా సాగునీటి కాలువలకు 4000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఉదయం 6 గంటలకు భద్రాచలంలో వరద మట్టం 50.30 అడుగులకు చేరింది. రెండవ హెచ్చరిక అమలులో ఉంది. పోలవరం ప్రాజెక్టు ద్వారా ఈ వరద ప్రవాహం దౌలేశ్వరం బ్యారేజీకి చేరుతుంది. ఈరోజు రాత్రి వరకు బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.