Site icon HashtagU Telugu

Chandrababu Ring Story: బాబు ‘రింగ్’ మహిమ!

Babu Ring

Babu Ring

మదనపల్లిలో జరిగిన బహిరంగ సభలో తొలిసారిగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు ఎడమచేతి చూపుడు వేలికి ప్లాటినం ఉంగరం ధరించి కనిపించారు. తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు తన వెంట తీసుకెళ్లేది కేవలం పెన్నే తప్ప మరేమీ కాదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన దుస్తులు, వేషధారణ మారలేదు. చూపుడు వేలుకు ఉంగరం ధరించడం శక్తి, అధికారం, నాయకత్వాన్ని సూచిస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

పూర్వకాలంలో రాజులు తమ చూపుడు వేలుకు ఉంగరాలు ధరించేవారు. చంద్రబాబు ఇంకా పవర్ ఫుల్ పొలిటీషియన్ అని తన కేడర్ కు, ప్రజలకు స్టేట్ మెంట్ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉంగరం ధరించడం కూడా టీడీపీ అధినేత సెంటిమెంట్‌ను నమ్ముతున్నట్లు సూచిస్తోందని జ్యోతిష్యులు అంటున్నారు. ఈ రింగ్ టీడీపీ కార్య క ర్త ల్లో హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఎన్నికల బరిలోకి దిగితే మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వస్తుందో లేదో కాలమే చెప్పాలి.