Site icon HashtagU Telugu

First Night: సోషల్ మీడియాలో ఫస్ట్ నైట్ వీడియో… అది చూసిన భార్య ఏం చేసిందంటే?

Bride

Bride

First Night: అంతర్జాలం నానాటికి సమాజాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. పిచ్చి పనులకు అడ్డాగా మారిపోతోంది. ఇటీవల కాలంలో కొంతమంది ప్రవర్తిస్తున్న తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉంటోంది. నాలుగు గోడల మధ్య రహస్యంగా ఉండాల్సిన భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని సోషల్ మీడియాకు ఎక్కించి పైశాచిక ఆనందం పొందుతున్నారు కొంతమంది. ఇటీవల లైక్ ల కోసం సోషల్ మీడియాలో తమ ఫస్ట్ నైట్ వీడియోను పెట్టి తీవ్ర విమర్శల పాలయ్యారు ఓ జంట. అదే క్రమంలో అలాంటి ఘటన ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో చోటుచేసుకుంది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది.

కాట్రేనికోన మండలంలోని ఓ తీర ప్రాంత గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇది వెలుగులోకి రావడంతో ఆ భర్త కటకటాల పాలయ్యాడు. సదరు యువకుడికి ఫిబ్రవరి 8న అదే గ్రామానికి చెందిన బాలికతో వివాహమైంది. ఆ తర్వాత వారికి పెద్దలు శోభనం ఏర్పాటు చేశారు. ఆ యువకుడు తన భార్యతో కలిపిన మొదటి రాత్రి దృశ్యాలను వీడియోలో చిత్రీకరించాడు. ఆ తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఈ విషయం బాలిక తల్లికి తెలిసింది.

అల్లుడు మీద తీవ్ర అగ్రహానికి లోనైన ఆమె గత నెల 20వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి ఫిబ్రవరి 28వ తేదీన ఆ యువకుడిని అరెస్టు చేశారు. అతడిని కోర్టు 14 రోజుల రిమాండ్ విధించారని కాట్రేనికోన ఎస్సై తెలిపారు.

Exit mobile version