Site icon HashtagU Telugu

నాగశౌర్య, అనీష్ ఆర్ కృష్ణ, ఐరా క్రియేషన్స్ ‘కృష్ణ వ్రింద విహారి’ ఫస్ట్ లుక్ విడుదల

Naga Shauryas Upcoming Romantic Comedy Titled Krishna Vrinda Vihari Imresizer

Naga Shauryas Upcoming Romantic Comedy Titled Krishna Vrinda Vihari Imresizer

హ్యాండ్సమ్ హీరో నాగ శౌర్య విభిన్న కథా చిత్రాలలో డిఫరెంట్ రోల్స్‌ను పోషిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ చిత్రాన్ని చేస్తున్నారు.

నాగ శౌర్య పుట్టిన రోజు (జనవరి 22) సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేక‌ర్స్‌. కృష్ణ వ్రింద విహారి అనే ఈ టైటిల్‌ ఎంతో ట్రెడిషనల్‌గా, కొత్త‌గా ఉంది. కృష్ణ, వ్రింద అనేవి హీరో హీరోయిన్ల పాత్ర‌ల పేర్లు అని తెలుస్తోంది. టైటిల్‌ను డిజైన్ చేసిన విధానం కూడా చక్కగా కుదిరింది.

ఈ పోస్టర్‌లో నాగ శౌర్య అందరినీ మెప్పించేలా ఉన్నారు. నిలువు బొట్టుతో బ్రాహ్మణుడిగా కనిపించారు. పోస్టర్ చూస్తుంటే పెళ్లి తంతులా ఉంది. మొత్తానికి పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.

ఇప్ప‌టివ‌ర‌కు నాగ శౌర్య చేసిన పాత్రలన్నింటి కంటే ఈ రోల్ డిఫరెంట్‌గా ఉండబోతోంది అని తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగ శౌర్య పూర్తిగా స‌రికొత్త‌ పాత్రలో కనిపించబోతోన్నారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్త‌య్యింది. ఒక్క పాట చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. షిర్లే సెటియా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియ‌ర్ న‌టి రాధిక ఈ సినిమాలో ముఖ్య పాత్రను పోషించారు.

ఈ మూవీలో వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య వంటి కమెడియన్స్ ఇంపార్టెంట్ రోల్స్‌లో కనిపించ‌నున్నారు. వారి క్యారెక్ట‌ర్స్ ఈ సినిమాకు హైలెట్ కానున్నాయి.

శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఉషా మూల్పూరి నిర్మాతగా రాబోతోన్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు, సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.

నటీనటులు: నాగ శౌర్య, షిర్లే సెటియా, రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు