Ashes 2023: యాషెస్ సిరీస్‌లో మూడో టెస్టు మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది. మూడవ రోజు ఇంగ్లీష్ జట్టు ఫాస్ట్ బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు, దాని ఆధారంగా ఇంగ్లాండ్ మ్యాచ్‌లో పునరాగమనం చేసింది. ఈ సమయంలో సచిన్ టెండూల్కర్ ఇంగ్లాండ్ ఆటగాళ్లకు సూచనలిచ్చారు. మూడో రోజు ఆట ముగిసిన తర్వాత సచిన్ టెండూల్కర్ ట్విట్టర్లో ఇంగ్లాండ్ ఆటగాళ్లను ఉద్దేశించి పోస్ట్ పెట్టాడు.
రేపు హెడింగ్లీలో మొదటి గంట కీలకం కానుంది. ఇంగ్లాండ్ తెలివిగా బ్యాటింగ్ చేస్తే విజయం వారిదే. బ్యాట్స్ మెన్స్ షాట్స్ ఆడేటప్పుడు జాగ్రత్తగా ఆడాలి. క్రమశిక్షణగా అవసరం. ఇలా చేయడం ద్వారా లక్ష్యాన్ని సులభంగా సాధించగలరు అని అన్నారు సచిన్. కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు స్టువర్ట్ బ్రాడ్, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్ విధ్వంసం సృష్టించారు. వార్నర్, ట్రావిస్ హెడ్ సహా ముగ్గురు కంగారూ బ్యాట్స్‌మెన్‌లను బ్రాడ్ అవుట్ చేశాడు.
Read More: Use Emojis Carefully : ఎడాపెడా ఎమోజీ వాడినందుకు 50 లక్షలు కట్టాల్సి వచ్చింది