Site icon HashtagU Telugu

Corona: ఇజ్రాయెల్ లో కొత్త వేరియెంట్ తొలి ‘ఫ్లోరోనా’ కేసు నమోదు

Template 2021 12 31t120055

Template 2021 12 31t120055

ఇజ్రాయెల్ లో కొత్త వేరియెంట్ కలవరపెడుతుంది. ఇప్పటికే కరోనాలో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి ప్రపంచాన్ని ఆందోళన పరుస్తున్న నేపథ్యంలో.. ఇజ్రాయెల్ ఈ కొత్త వైరస్ మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ‘ఫ్లోరోనా’ తొలి కేసు నమోదైంది. కరోనాతో పాటు ఫ్లూ కూడా సోకే డబుల్ ఇన్ఫెక్షన్ ను ఫ్లోరోనా అని పిలుస్తున్నారు. ప్రసవం కోసం రాబిన్ మెడికల్ సెంటర్ లో చేరిన మహిళకు ఈ డబుల్ ఇన్ ఫెక్షన్ సోకినట్టు అధికారులు చెప్పారు.

ప్రస్తుతం ఈ వైరస్ ను శాస్త్రవేత్తలు అధ్యాయనం చేస్తున్నారు. ఈ రెండు వైరస్ లు కలిస్తే జబ్బు తీవ్రత పెరుగుతుందా? అన్న దానిపై విశ్లేషిస్తున్నారు. మరికొందరు పేషెంట్లలోనూ ‘ఫ్లోరోనా’ మూలాలు ఉండి ఉంటాయని చెబుతున్నారు. కాగా, ఇప్పటికే శుక్రవారం నుంచి ఆ దేశ ప్రభుత్వం నాలుగో డోసు కరోనా వ్యాక్సిన్ ను రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి, కరోనా ముప్పు ఎక్కువగా ఉన్న వారికి వేస్తోంది.