Site icon HashtagU Telugu

Jayanthi Pantnaik: జాతీయ మహిళా కమిషన్ తొలి ఛైర్ పర్సన్ జయంతి పట్నాయక్ కన్నుమూత..!!

Jayanthi

Jayanthi

కాంగ్రెస్ సీనియర్ నేత, జాతీయ మహిళా కమిషన్ తొలి చైర్ పర్సన్ జయంతి పట్నాయక్ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 90 సంవత్సరాలు. ఒడిశా మాజీ సీఎం జానకీ వల్లభ్ పట్నాయక్ భార్య. భారత పార్లమెంటేరియన్, ప్రముఖ సామాజిక కార్యకర్త అయిన ఆమె బుధవారం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు OPCCమాజీ చీఫ్ నిరంజన్ పట్నాయక్ తెలిపారు. కాగా ఆమెకు ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె భర్త ఒడిశా మాజీ సీఎం 2015లో మరణించారు. జయంతి పట్నాయక్ మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలిపారు.

ప్రముఖలు జయంతి పట్నాయక్ కు నివాళులర్పించారు.