Site icon HashtagU Telugu

Dubai: ఆ షాపింగ్ మాల్ లో క్యాషియర్ ఉండరట.. మరి డబ్బు ఎలా కట్టాలో తెలుసా?

Dubai

Dubai

మనం ఏదైనా షాపింగ్ మాల్స్ కి జనరల్ స్టోర్స్, కిరాణా షాపులకు, సూపర్ మార్కెట్ లకు వెళ్లినప్పుడు అక్కడ మనకు కావాల్సినవన్నీ తీసుకున్న తర్వాత బిల్లు చెల్లించడం అన్నది తప్పనిసరి. కొంతమంది బిల్లు చెల్లించకుండా దొంగతనాలు కూడా చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు దొరికిపోయినప్పుడు శిక్ష కూడా పడుతూ ఉంటుంది. అయితే మనం ఎటువంటి షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్లకు వెళ్ళినా కూడా అక్కడ బిల్లింగ్ కౌంటర్ అన్నది తప్పనిసరిగా ఉంటుంది. మన దగ్గర క్యాష్ ఉంటే క్యాష్ కడతాం లేదంటే ఆన్లైన్ పేమెంట్ చేస్తూ ఉంటాం.

కానీ దుబాయ్‌లోని ఒక స్టోర్‌లో క్యాషియర్‌ ఉండరు. అంటే వినియోగదారుల నుంచి డబ్బులు తీసుకునేందుకు ఎవరూ ఉండరు. మరి సరుకులు తీసుకున్నాక ఆ స్టోర్‌లో క్యాష్‌ ఎలా పే చేస్తారు అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. యూఏఈ లోని దుబాయ్‌ పగలు, రాత్రి అనే తేడాలేకుండా నిత్యం వెలుగు జిలుగులతో మెరిసిపోతుంటుంది. ఈ మహానగరంలో 2018లో అమెజాన్‌ కెరెఫోర్‌ మినీ అనే షాపింగ్‌ స్టోర్‌ తెరిచింది. ఇది చూసేందుకు ఇతర స్టోర్ల మాదిరిగానే కనిపిస్తుంది. అయితే ఇది అత్యాధునిక స్టోర్‌గా పేరొందింది.

ఈ స్టోర్‌లో సరుకులు కొనుగోలు చేసే వినియోగదారుల దగ్గర ఈ స్టోర్‌కు సంబంధించిన యాప్‌ ఉండాలి. ఇది ఉంటేనే స్టోర్‌లోనికి ఎంట్రీ లభిస్తుంది. లోనికి వచ్చాక వినియోగదారులు తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. ఈ స్టోర్‌లో హై రిజల్యూషన్‌ కలిగిన సీసీ కెమెరాలు ఉంటాయి. అవి సెన్సార్‌ను కలిగివుంటాయి. ఇవి వినియోగదారుల ప్రతీ కదలికను పర్యవేక్షిస్తుంటాయి. స్టోర్‌లోని వచ్చిన వినియోగదారులు తాము సరుకులు తీసుకుని బ్యాగులో వేసుకోగానే రసీదు వివరాలు వారి ఫోనులో ప్రత్యక్షమవుతాయి. షాపింగ్‌ పూర్తయిన తరువాత పేమెంట్‌ ఆదే ఫోను ద్వారా చేయాల్సి ఉంటుంది. కెరెఫోర్‌ సీఈఓ హనీ వీస్‌ మాట్లాడుతూ.. భవిష్యత్‌లో అంతా ఇలానే ఉంటుందని, ఈ స్టోర్‌లోకి వచ్చే వినియోగదారులు ప్రత్యేక అనుభూతికి లోనవుతారని అన్నారు.