Brij Bhushan-FIR : బ్రిజ్‌ భూషణ్‌ పై 2 ఎఫ్‌ఐఆర్‌లలో సంచలన ఆరోపణలు

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్ సింగ్‌ పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ లలోని(Brij Bhushan-FIR) సంచలన విషయాలు బయటికి వచ్చాయి.

  • Written By:
  • Publish Date - June 2, 2023 / 01:11 PM IST

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్ సింగ్‌ పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ లలోని(Brij Bhushan-FIR) సంచలన విషయాలు బయటికి వచ్చాయి. ఢిల్లీలోని కన్నౌట్‌ ప్యాలెస్‌ పోలీసు స్టేషన్‌లో 2 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. మొదటి ఎఫ్‌ఐఆర్‌ ను ఆరుగురు మహిళా రెజర్లతో ,  రెండో ఎఫ్‌ఐఆర్‌ను మరో మైనర్‌ రెజ్లర్‌ తండ్రి ఫిర్యాదుతో పోలీసులు నమోదు చేశారు. బ్రిజ్‌ భూషణ్‌ తమను బెదిరించడంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని రెజ్లర్లు ఆరోపించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో ఉంది. తమ టీ-షర్ట్‌ ను లాగడం.. ఛాతీపై, పొట్టపై చేతులు వేయడం.. హగ్ చేసుకోవడం వంటివి చేసేవాడని వారు ఆరోపించారు.

Also read : Harassment Case: లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నటుడికి హైకోర్టు షాక్

కోచ్‌ లేని టైంలో తమ దగ్గరికి వచ్చి ఇబ్బంది పెట్టేవాడని ఒక  రెజ్లర్‌ చెప్పినట్టు ఎఫ్‌ఐఆర్‌ కాపీలో(Brij Bhushan-FIR) నమోదు చేశారు. బ్రిజ్‌ భూషణ్‌ కు భయపడి మహిళా అథ్లెట్లు..  తమ గదుల్లో నుంచి ఎప్పుడు బయటకు వచ్చినా గ్రూప్ లుగా ఉండేవారని కూడా ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించారు. అయితే ఈ ఆరోపణలను బ్రిజ్‌భూషణ్‌ మొదటి నుంచీ ఖండిస్తున్నారు. రెజ్లర్లు చేసిన ఆరోపణలు నిజమని తేలితే తాను ఉరేసుకోడానికైనా సిద్ధమని ఇటీవల ఆయన ప్రకటించారు. కాగా, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా  సెక్రటరీ వినోద్‌ తోమర్‌పైనా ఓ రెజ్లర్‌ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారని ఎఫ్‌ఐఆర్‌ రిపోర్ట్ లో ఉంది. ఓ సారి తాను ఆ ఆఫీసుకు వెళ్లినప్పుడు.. తోమర్‌  అభ్యంతరకరంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించారు.