Firing In Court : ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో కాల్పులు జరిగాయి. రెండు గ్రూపుల లాయర్ల మధ్య వాగ్వాదం తర్వాత గన్ ఫైర్ జరిగింది. ఈరోజూ మధ్యాహ్నం 1.35 గంటల టైంలో ఈ ఘటన చోటుచేసుకుంది. లాయర్లలో ఒకరు గన్ తో గాల్లోకి కాల్పులు జరిపారని పోలీసులు గుర్తించారు. తాము వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చామన్నారు. ఈ కాల్పుల ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేశారు.
Also read : New Born Sold For Rs 800 : రూ.800కే ఆడ శిశువును అమ్మేసిన తల్లి
ఈ కాల్పుల ఘటనను ఢిల్లీ బార్ కౌన్సిల్ చైర్మన్ కేకే మనన్ ఖండించారు. దీనిపై సమగ్ర విచారణ చేపడతామని చెప్పారు. కోర్టు(Firing In Court) ఆవరణలో ఏ న్యాయవాది కూడా ఆయుధాలను ఉపయోగించకూడదని ఆయన పేర్కొన్నారు. “ఈ కాల్పులు జరిపేందుకు వాడిన గన్ కు లైసెన్స్ ఉందా .. లేదా.. అనేదానిపై విచారణ చేస్తాం. ఆయుధాలకు లైసెన్స్ ఉన్నా .. కోర్టు ప్రాంగణంలో దాన్ని వాడటం చట్ట విరుద్ధం” అని ఢిల్లీ బార్ కౌన్సిల్ చైర్మన్ కేకే మనన్ వెల్లడించారు. అంతకుముందు ఏప్రిల్ నెలలో ఢిల్లీలోని సాకేత్ కోర్టులో కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ, ఒక వ్యక్తి ఒక మహిళపై గన్ ఫైర్ చేసి హత్య చేయడం కలకలం రేపింది. దాడి చేసిన వ్యక్తిని న్యాయవాది అయిన కామేశ్వర్ ప్రసాద్ సింగ్ అలియాస్ బినోద్ సింగ్‌గా గుర్తించారు. అతడిని బార్ కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. దాడికి పాల్పడిన న్యాయవాది బాధిత మహిళకు రూ.25 లక్షలు అప్పు ఇచ్చాడని, ఆ తర్వాత డబ్బు తిరిగి ఇవ్వడానికి ఆ మహిళ విముఖత చూపడంతో హత్య చేశాడనే ప్రచారం జరిగింది.