Site icon HashtagU Telugu

Delhi Saket Court firing: ఢిల్లీలో దారుణం, పట్టపగలే సాకేత్ కోర్టులో కాల్పులు. మహిళ పరిస్థితి విషమం

Delhi Saket Court Firing

Delhi Saket Court Firing

ఢిల్లీలో దారుణం జరిగింది. సాకేత్ కోర్టులో (Delhi Saket Court firing) న్యాయవాది వేషంలో ఉన్న ఓ వ్యక్తి శుక్రవారం ఉదయం ఓ మహిళపై కాల్పులు జరిపాడు. నిందితుడు మహిళపై 4 బుల్లెట్లు కాల్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సస్పెండ్ అయిన లాయర్, తన భార్యపై అతి కిరాతకంగా కాల్పులు జరిపాడు. అప్పటికే వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఆగ్రహానికి గురైన సదరు భర్త భార్యపై కాల్పులకు తెగపబడ్డాడు. లాయర్స్ బ్లాక్ దగ్గర జరిగిన ఈ ఘటన ఈడీ కోర్టులో కలకలం సృష్టించింది.

ప్రవేశ ద్వారం వద్ద ఉన్న స్కానర్ ద్వారా అందరినీ స్కాన్ చేయగా నిందితుడు ఆయుధంతో కోర్టులోకి ఎలా ప్రవేశించాడు అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. నిందితుడు న్యాయవాది కావడాన్ని ఆసరాగా చేసుకుని భద్రతా తనిఖీలు చేయకపోవడంతో నేరుగా లోపలికి వెళ్లారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. గాయపడిన మహిళ కోర్టు ప్రాంగణం నుంచి బయటకు వెళ్తున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.