Site icon HashtagU Telugu

Punjab Firing: భటిండా మిలిటరీ స్టేషన్‌లో విచక్షరహితంగా కాల్పులు, నలుగురు జవాన్లు మృతి

Gun

Gun

పంజాబ్‌లోని భటిండాలోని (Punjab Firing) మిలటరీ స్టేషన్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిగాయి. కాల్పుల్లో నలుగురు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు కాల్పుల ఘటన జరిగినట్లు చెబుతున్నారు. కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనకు పాల్పడింది ఎవరో కూడా తెలియరాలేదు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తెల్లవారుజామున 4.35 గంటలకు కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో క్విక్ రియాక్షన్ టీమ్‌లను సక్రియం చేశారు. మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టి సీల్ చేశారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.