Site icon HashtagU Telugu

4 Killed : తమిళనాడులో బాణాసంచా గోడౌన్‌లో పేలుడు.. న‌లుగురు మృతి

4 killed In Fire

Fire

తమిళనాడులోని మైలాడుతురైలో ఘోర అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. బాణాసంచా గోడౌన్‌లో పేలుడులో నలుగురు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. పేలుడులో మృతి చెందిన వారిని మాణికం, మధన్, రాఘవన్, నికేష్‌లుగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మరో నలుగురిని రక్షించి చికిత్స నిమిత్తం మైలాడుతురై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గోడౌన్ యజమాని మోహన్ అనే వ్యక్తి లైసెన్స్ పొందాడ‌ని పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణలో తేలింది. పేలుడు ఘటనకు సంబంధించి తదుపరి విచారణ నిమిత్తం గోడౌన్ యాజ‌మానిని అదుపులోకి తీసుకున్నారు. మైలాడుతురై జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌వో) మణిమేకలై, ఆర్డీఓ అర్చన, నాగపట్నం ఎస్పీ హర్ష్ సింగ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. మరోవైపు పేలుడులో మ‌ర‌ణించిన వారికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Exit mobile version