రష్యాలోని సైబేరియన్ పట్టణంలోని ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఈ అగ్నిప్రమాదం (Fire Accident)లో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అయితే భవనంలోని రెండో అంతస్తు మొత్తం దగ్దమైందని, మంటలను అదుపులోకి తీసుకొచ్చామని సేఫ్టీ అధికారులు పేర్కొన్నారు. రక్షణ సిబ్బంది ఇంకా ఘటనా స్థలంలో పని చేస్తున్నారని, మృతదేహాలను వెలికి తీసేందుకు యత్నిస్తున్నారని అధికారులు తెలిపారు.
సైబీరియాలోని కెమెరోవో నగరంలో నమోదుకాని వృద్ధుల గృహంలో డిసెంబర్ 23న జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 20 మంది చనిపోయారు. భవనంలోని రెండో అంతస్తు మొత్తం మంటల్లో కాలిపోయిందని ఫైర్ సేఫ్టీ అధికారులు తెలిపారు. అయితే మంటలు అదుపులోకి వచ్చాయి. నివేదిక ప్రకారం.. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశంలో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్న అగ్నిమాపక సిబ్బంది శిధిలాలను తొలగించే పని చేస్తున్నారు. తాజా లెక్కల ప్రకారం అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది మరణించారు. రష్యా అంతటా రిజిస్ట్రేషన్ లేకుండానే వృద్ధుల కోసం చాలా గృహాలు పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు.
Also Read: Road Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
ఈ ఏడాది నవంబర్ 5న రష్యాలోని కోస్ట్రోమా నగరంలోని ఓ కేఫ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 15 మంది చనిపోయారు. వాగ్వాదం సందర్భంగా ఎవరో ఫ్లేర్ గన్ ఉపయోగించడంతో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. రెస్క్యూ టీమ్‌లు 250 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. కోస్ట్రోమా మాస్కోకు ఉత్తరాన దాదాపు 340 కిలోమీటర్లు (210 మైళ్ళు) దూరంలో ఉంది. మంటలు చెలరేగడంతో కేఫ్ పైకప్పు కూలిపోయింది. క్రిమినల్ దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఫ్లేర్ గన్ ఉపయోగించిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.