Site icon HashtagU Telugu

Aircrash: విమానంలో మంటలు… ఎమర్జెన్సీ ల్యాండింగ్ తో!

Whatsapp Image 2023 03 09 At 21.07.03

Whatsapp Image 2023 03 09 At 21.07.03

Aircrash: ఈ మధ్య గాల్లోనే ప్రాణాలు కలిసిపోతున్నాయి. అంటే విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్న మాట. మనం దేశంతో పోల్చితే ఇతర దేశాల్లో ఘోరమైన విమాన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. విమానయాన శాఖ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఆగటం లేదు. అయితే తాజాగా ఓ విమాన ప్రమాదం నుంచి ప్రయాణికులు బయట పడ్డారు. ఇంజిన్ లో చెలరేగిన మంటలను వెంటనే గుర్తించిన పైలెట్ చర్యలు చేపట్టారు.

శ్రీ ఎయిర్‌లైన్స్‌ కు చెందిన విమానం ఖాట్మండు నుండి నైరుతి నేపాల్‌లోని భైరహవాకు వెళ్తోంది. విమానంలో సిబ్బందితో సహా 78 మంది ఉన్నారు. కుడి ఇంజిన్‌లో
మంటలు చెలరేగినట్లు పైలట్‌ నివేదించడంతో వెంటనే ఆ విమానాన్ని ఖాట్మండుకు మళ్లించినట్లు శ్రీ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి అనిల్ మనంధర్ చెప్పారు. ఖాట్మండులో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు

మౌంట్ ఎవరెస్ట్‌తో సహా ప్రపంచంలోని 14 ఎత్తైన శిఖరాలలో ఎనిమిదింటికి నిలయమైన పర్వత నేపాల్‌కు తరచుగా విమాన ప్రమాదాలు జరిగిన చరిత్ర ఉంది. వాటిలో చాలా కష్టతరమైన భూభాగాలు, వాతావరణ పరిస్థితులలో ఆకస్మిక మార్పు కారణంగా ఈ విమాన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. జనవరిలో దేశ రాజధాని ఖాట్మండు నుంచి పొకారా వెళ్తుండగా.. ల్యాండింగ్‌ సమయంలో విమానం క్రాష్‌ అయ్యింది. ప్రమాదం జరిగిన విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది చనిపోయారు.