Site icon HashtagU Telugu

Fire Department : దీపావళి సందర్భంగా అప్ర‌మ‌త్త‌మైన తెలంగాణ అగ్నిమాప‌క శాఖ

Fire Engine Imresizer

Fire Engine Imresizer

దీపావళిని దృష్టిలో ఉంచుకుని ఫైర్ కంట్రోల్ రూమ్‌లో పనిచేస్తున్న అన్ని డిస్ట్రెస్ కాల్ ఆఫీసర్ల సెలవులు రద్దు చేయబడ్డాయి. ప్రాంతీయ అగ్నిమాపక అధికారి (ఆర్‌ఎఫ్‌ఓ) సెల‌వులు ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన మరియు అగ్నిమాపక శాఖ ఏదైనా విపత్తును ఎదుర్కొనేందుకు అత్యంత అప్రమత్తంగా ఉందని తెలిపారు. నగరంలోని హై-రిస్క్ జోన్‌లుగా విభ‌జించామ‌ని తెల‌పారు. ఎన్టీఆర్‌ స్టేడియం, నుమాయిష్‌ గ్రౌండ్స్‌, పరేడ్‌ గ్రౌండ్స్‌, సిద్దియాంబర్‌ బజార్‌ రోడ్‌ హైరిస్క్‌ జోన్లుగా ఉన్నాయి. గతంలో అగ్ని ప్రమాదాలు జరిగిన కొన్ని కాలనీలు, ఇండస్ట్రియల్ క్లస్టర్లు కూడా గుర్తించబడ్డాయన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని దీపావళి మూడు రోజులలో సాధారణంగా సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి దాటిన మధ్య అగ్ని ప్రమాదాల ఫిర్యాదులు పెరుగుతాయని RFO తెలిపారు.