Durg-Puri Express: బాలాసోర్ రైలు ప్రమాదం మరవకముందే ఒడిశాలో మరో రైలు ప్రమాదం.. ఏసీ కోచ్ లో మంటలు

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం మరవకముందే మరో రైలులో మంటలు చెలరేగాయి. ఒడిశాలోని నువాపాడా జిల్లాలో దుర్గ్-పూరీ ఎక్స్‌ప్రెస్‌ (Durg-Puri Express)లోని ఏసీ కోచ్‌లో గురువారం మంటలు చెలరేగాయని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
Durg-Puri Express

Resizeimagesize (1280 X 720) 11zon

Durg-Puri Express: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం మరవకముందే మరో రైలులో మంటలు చెలరేగాయి. ఒడిశాలోని నువాపాడా జిల్లాలో దుర్గ్-పూరీ ఎక్స్‌ప్రెస్‌ (Durg-Puri Express)లోని ఏసీ కోచ్‌లో గురువారం మంటలు చెలరేగాయని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. అయితే ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఖరియార్ రోడ్ స్టేషన్‌లో ఆగి ఉన్న రైలు బి-3 కోచ్ నుండి పొగలు వచ్చినట్లు రైల్వే శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై రైలు నుంచి బయటకు వచ్చారు.

రాపిడి, బ్రేక్‌లు అసంపూర్తిగా విడుదల చేయడం వల్ల బ్రేక్ ప్యాడ్‌లు మంటలకు గురయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. అయితే మంటలు బ్రేక్ ప్యాడ్‌లకే పరిమితమయ్యాయి. ఎటువంటి నష్టం జరగలేదు. గంటలోపు లోపాన్ని సరిచేసి రాత్రి 11 గంటల ప్రాంతంలో రైలును పంపించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read: Balasore Train Accident: బాలాసోర్ రైలు ప్రమాదంలో 3 రైళ్లు ధ్వంసం.. ఆ రైళ్ల నిర్మాణానికి ఎంత డబ్బు ఖర్చవుతుందో తెలుసా..?

ఇటీవల బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో మూడు రైళ్లు ఢీకొనడంతో భారీ రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో 288 మంది మరణించారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. దీంతో రైల్వే భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

  Last Updated: 09 Jun 2023, 10:05 AM IST