Site icon HashtagU Telugu

Fire Accident : లారీలో పేలిన గ్యాస్ సిలిండ‌ర్లు .. త‌ప్పిన పెను ప్ర‌మాదం

LPG Users

Lpg Imresizer

ప్రకాశం జిల్లాలో గ్యాస్ సిలిండ‌ర్ లోడుతో వెళ్తున్న లారీలో సిలిండ‌ర్లు పేలాయి. కొమరోలు మండలం దద్దవాడ గ్రామం వద్ద అనంతపురం-గుంటూరు జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి తర్వాత ఈ పెను ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగాయి. లారీలో 300లకు పైగా సిలిండర్లు ఉండగా వాటిలో 100కి పైగా పేలి లారీ పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు నుంచి నెల్లూరు జిల్లా ఉలవపాడుకు భారత్ గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ క్యాబిన్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన డ్రైవర్ లారీని ఆపి కిందకు దిగి పరారయ్యాడు. గ్యాస్ సిలిండర్లు కాలిపోవడంతో జాతీయ రహదారికి ఇరువైపులా అరకిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. కొద్దిసేపటికి సిలిండర్లు పేలడంతో పోలీసులు అప్రమత్తమై ఎవరూ అక్కడికి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.