Site icon HashtagU Telugu

Delhi: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.

Delhi

Delhi

Delhi: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఖాన్‌పూర్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలోని నాలుగు అంతస్తుల కమర్షియల్ భవనంలో గురువారం అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. తిగ్రీ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని భారీ భవంతిలో మంటలు చెలరేగినట్లు పోలీసు కంట్రోల్ రూమ్ కి కాల్ అందిందని, ఆ తర్వాత పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుందని పోలీసులు తెలిపారు.

We’re now on WhatsApp : Click to Join

భవనంలోని వివిధ అంతస్తులలో హీరో షోరూమ్, జిమ్ మరియు ఇతర ప్రయివేట్ కార్యాలయాలు ఉన్నాయి. మంటల్ని అదుపు చేసేందుకు నాలుగు అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయని ఓ అధికారి తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, కొందరికి గాయాలు అయినట్లు తెలుస్తుంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు అని అధికారి తెలిపారు.

Also Read: Chittoor Politics : చిత్తూరు రాజకీయం.. పెద్దిరెడ్డి Vs నల్లారి