Site icon HashtagU Telugu

Taj Express Train Fire: ఢిల్లీలోని తాజ్ ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ అగ్నిప్రమాదం

Train Catches Fire Delhi

Train Catches Fire Delhi

Taj Express Train Fire: ఢిల్లీలోని సరితా విహార్ ప్రాంతంలోని ప్యాసింజర్ రైలు కోచ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన సాయంత్రం 4.24 గంటలకు జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఆరు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సుమారు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాలిపోయిన కోచ్‌లను రైలు నుండి వేరు చేశారు.

రైలులో అగ్నిప్రమాదం జరిగినట్లు పీసీఆర్‌కు సాయంత్రం 4.41 గంటలకు సమాచారం అందిందని రైల్వే డీసీపీ తెలిపారు. రైలు ఢిల్లీ-ఆగ్రా మధ్య నడుస్తుంది. ఓఖ్లా రైల్వే స్టేషన్ ముందు రైలులో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో రైలును నిలిపివేశారు. కోచ్‌లో కూర్చున్న ప్రయాణికులు ఇతర కోచ్‌లకు వెళ్లడం లేదా కిందకు దిగడంతో ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. రైల్వేశాఖ తదుపరి చర్యలు తీసుకుంటోంది.

రైలు హర్కేష్ నగర్ సమీపంలోకి రాగానే రైలులోని డి3 కోచ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ సమయంలో కోచ్‌లో 15 నుంచి 20 మంది ప్రయాణికులు కూర్చున్నారు. రైలులో మంటలు రావడంతో ప్రయాణికులు చైన్‌ లాగి రైలును నిలిపివేశారు. దీంతో ప్రయాణికులంతా ఒకరి తర్వాత ఒకరు కిందకు దిగారు.కొద్దిసేపటికే మంటలు డి4, డి2లకు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. డి3 కోచ్‌లోని బాత్‌రూమ్‌కు సమీపంలో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రమాదం అనంతరం రైలును ఓఖ్లా మండి రైల్వే స్టేషన్‌కు తరలించారు.

Also Read: Lok Sabha Exit Poll 2024: ఎన్డీయే గెలుపు ఆకాంక్షిస్తూ వారణాసిలో రుద్రాభిషేక యాగం