నిజామాబాద్ ఆర్యనగర్‌లోని టీ మార్ట్ సూపర్ మార్కెట్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. సూపర్ మార్కెట్‌లో మంటలు చెలరేగి దుకాణం మొత్తానికి వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. 2 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు వారు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని పోలీసులు భావిస్తున్నారు.
Fire Accident : నిజామాబాద్‌లోని ఓ సూపర్‌మార్కెట్‌లో అగ్నిప్రమాదం

Fire