Site icon HashtagU Telugu

Hanamkonda: హన్మకొండ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం

Hanamkonda

New Web Story Copy (10)

Hanamkonda: వరంగల్ లోని హన్మకొండ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. శ్రీనివాస కిడ్నీ సెంటర్, ప్రసూతి ఆసుపత్రిలో బుధవారం స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తినష్టం జరగలేదని చెప్తున్నారు. ఆస్పత్రి భవనం నుంచి పొగలు వ్యాపించడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుంది. అప్పటికే మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక అధికారులు మంటలను అదుపు చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read: Hyderabad: 70వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు రెడీగా ఉన్నాయి: కేటీఆర్