Site icon HashtagU Telugu

4 Killed : యూపీలోని ఝాన్సీలో ఘోర అగ్నిప్ర‌మాదం.. న‌లుగురు మృతి

4 killed In Fire

Fire

యూపీలోని ఝాన్సీలో ఘోర అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఓ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘ‌ట‌న‌లో నలుగురు మృతి చెందారు. సిప్రీ బజార్ ప్రాంతంలో ఉన్న మూడు అంతస్తుల ఎలక్ట్రానిక్స్ షోరూమ్ మరియు స్పోర్ట్స్ స్టోర్‌లో మంటలు వ్యాపించాయి. ప్ర‌మాద స‌మ‌యంలో లోపల కొంత మంది చిక్కుకున్నార‌ని పోలీసులు తెలిపారు. షోరూమ్‌లోనే ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం కాగా, వారి మృతదేహాలను వెలికితీశారు.యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న మరో మహిళను రక్షించి ఆసుపత్రికి తరలించారు. కాలిన గాయాలతో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు సుమారు 10 గంటల పాటు సహాయక చర్యలు చేపట్టారు. ఝాన్సీ జిల్లా మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి విచారణకు ఆదేశించారు.