Site icon HashtagU Telugu

Fire Accident : రాజేంద్ర‌న‌గ‌ర్ కాటేదాన్‌లో భారీ అగ్నిప్ర‌మాదం

Fire

Fire

రాజేంద్రనగర్ కాటేదాన్ ఒమర్ ట్రేడర్ ప్లాస్టిక్ వేస్టేజ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభ‌వించింది. ఒక్కసారిగా మంట‌లు చెలరేగ‌డంతో కార్మికులు కంపెనీ నుండి బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు స్థానికులు స‌మాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువ‌చ్చారు. ఈ ప్ర‌మాదంలో కంపెనీ లో ఎవ్వరికీ ఏమి కాకపోవడం తో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్ర‌మాదం వ‌ల్ల పది లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. విద్యుత్ షార్ట్ స‌ర్య్కూట్‌ కారణంగానే ప్రమాదం జరిగిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ పరిశ్రమ కు ఏలాంటి అనుమతులు లేవని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్ర‌మాదంపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేపట్టారు.