ప్రకాశం జిల్లా గాడ్జుమల్లి మండలం బిట్రగుంట జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగాయి, అయితే డ్రైవర్ అప్రమత్తం చేయడంతో ప్రయాణికులు సురక్షితంగా బస్సు నుండి దిగారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురైయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా సకాలంలో బస్సు దిగారు. అయితే మంటల్లో ప్రయాణికులకు సంబంధించిన లగేజీ పూర్తిగా దగ్ధమైంది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Fire Accident : ప్రకాశంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో చెలరేగిన మంటలు.. ప్రయాణికులు సేఫ్

Bus Fire