Site icon HashtagU Telugu

Fire Accident : మాదాపూర్‌లోని ఓ రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం

4 killed In Fire

Fire

హైదరాబాద్ మాదాపూర్‌లోని మండి రెస్టారెంట్‌లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రెస్టారెంట్‌లో ఉన్న క‌స్ట‌మ‌ర్ల‌ను సురక్షితంగా బ‌య‌టికి తరలించారు. మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గం చెరువు మెట్రో స్టేషన్ సమీపంలోని “గర్ల్ ఫ్రెండ్ మండి రెస్టారెంట్”లో రాత్రి 8:40 గంటలకు విద్యుత్ బాక్స్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు సంభవించాయి. దీంతో ఆ ప్రాంతంలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగ‌డంతో రెస్టారెంట్ నిర్వ‌హ‌కులు అప్ర‌మ‌త్త‌మైయ్యారు. వెంట‌నే మంట‌ల‌ను ఆర్పేందుకు ప్ర‌య‌త్నించారు. అదే స‌మ‌యంలో ఘ‌ట‌నాస్థ‌లానికి అగ్నిమాప‌క సిబ్బంది చేరుకుని పూర్తిస్థాయిలో మంట‌ల‌ను అదుపులోకి తీస‌కువ‌చ్చారు. అత్యంత ర‌ద్దీగా ఉండే మాదాపూర్ దుర్గంచెరువు మెట్రో స్టేష‌న్ వ‌ద్ద అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గురైయ్యారు. నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా రెస్టారెంట్‌లో కూడా ర‌ద్దీ నెల‌కొంది. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన యాజ‌మాన్యం, స్థానికులు అంద‌రిని బ‌య‌టికి పంపిచివేయ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది.

Also Read:  Andhra Pradesh : కొన‌సాగుతున్న మున్సిపల్‌, అంగన్‌వాడీ కార్యకర్తలు స‌మ్మె

Exit mobile version