Fire Accident : హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీ సమీపంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో స్థానికులు

Published By: HashtagU Telugu Desk
4 killed In Fire

Fire

హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీ సమీపంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. సైబర్ టవర్స్ ఎదురుగా ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఈ సంఘటన జరిగింది, బిల్డింగ్‌లోని ఐదవ అంతస్తు నుండి మంటలు చెలరేగాయి, కిటికీల నుండి పొగలు బయటకు వచ్చాయి. దీంతో ఆ ప‌రిస‌ర ప్రాంతాల్లోని ప్ర‌జ‌లు అంతా ఖాళీ చేసి బ‌య‌టికి వెళ్లిపోయారు. అదృష్టవశాత్తూ సంఘటన సమయంలో కార్యాలయం ఖాళీగా ఉండటంతో ప్ర‌మాదం తప్పింది. అయితే, అగ్నిప్రమాదం కారణంగా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఎగసిపడుతున్న మంటలను అదుపు చేశారు.

  Last Updated: 21 May 2023, 08:25 AM IST