Site icon HashtagU Telugu

Delhi: ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్ లో భారీ అగ్ని ప్రమాదం.. పూర్తి వివరాలివే?

Delhi

Delhi

ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ అగ్ని ప్రమాదాల కారణంగా భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఢిల్లీ ఒక అగ్ని ప్రమాదం సంభవించింది. ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. నాలుగో అంతస్తు నుండి దట్టమైన పొగలు బయటకు రావడంతో చుట్టుపక్కల వార్డుల్లోని రోగులు, సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి విషయం చేరవేయడంలో వారు సమయానికి ఆసుపత్రికి చేరుకొని ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఎయిమ్స్ ఆసుపత్రిలోని ఎండోస్కోపీ విభాగంలో మంటలు రావడంతో ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు ఆసుపత్రి సిబ్బంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఎమర్జెన్సీ విభాగానికి కూడా వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన ఆసుపత్రి వర్గాలు వెంటనే స్పందించి ఎమర్జెన్సీ వార్డులోని రోగులను సురక్షిత వార్డులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించడంతో ఆరు ఫైరింజన్ లతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది సమయానికి స్పందించి రోగులను సురక్షిత వార్డులకు తరలించడంతో ఎటువంటి అనర్ధం జరగలేదు.

అయితే ప్రమాదానికి గల కారణం ఏంటి అనేది ఇంకా తెలియ రాలేదు. కారణమైతే ఇంకా తెలియరాలేదు కానీ షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగి ఉండవచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఆసుపత్రి వర్గాలు. ఈ విషయంపై ఇంకా మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Exit mobile version