Site icon HashtagU Telugu

FIR On Priyanka Gandhi  : 41 జిల్లాల్లో ప్రియాంకాగాంధీ, కమల్‌నాథ్‌లపై ఎఫ్‌ఐఆర్.. “50 శాతం కమీషన్” లేఖపై రగడ

Fir On Priyanka Gandhi

Fir On Priyanka Gandhi

FIR On Priyanka Gandhi  : మధ్యప్రదేశ్  పాలిటిక్స్ హీటెక్కాయి.. 

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, మధ్యప్రదేశ్  రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్, పీసీసీ మాజీ చీఫ్‌ అరుణ్ యాదవ్, సీనియర్ నేత జైరాం రమేష్‌లపై భోపాల్, ఇండోర్, గ్వాలియర్ సహా 41 జిల్లాల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. 

సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసేలా కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో తప్పుడు లెటర్ ను షేర్ చేశారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడంతో ఈ ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు.  

సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆ లెటర్ వైరల్ అయింది.

ఈ లెటర్ లో పేరున్న జ్ఞానేంద్ర అవస్థి అనే వ్యక్తిపైనా కేసు నమోదు చేశారు.  

Also read : Cars Under 10 Lakhs: మీరు కారు కొనాలనుకుంటున్నారా.. అయితే రూ. 10 లక్షల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉన్న కార్లు ఇవే..!

ఈ లెటర్ లో ఏముంది ?

“మధ్యప్రదేశ్  రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతి పనికి, ప్రతి పర్మిషన్ కు  50% కమీషన్ ను పుచ్చుకుంటోంది.. 50 శాతం కమీషన్ ఇచ్చిన తర్వాతే  వర్క్స్ కు సంబంధించిన  బిల్లులను  రిలీజ్ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో మాట వినేవారు లేరు. దళారులు డిపార్ట్‌మెంట్‌లో చురుగ్గా వ్యవహరిస్తూ 50 శాతం కమీషన్ తీసుకుంటున్నారు. టెండర్‌లో అంగీకరించిన మొత్తంలో 40 శాతం మాత్రమే చెల్లించి అసలు కాంట్రాక్టర్ మాకు పనిని ఇస్తున్నాడు. శాంక్షన్ అయ్యే కాంట్రాక్ట్ వర్క్ బడ్జెట్ లో 50 శాతం మొత్తాన్ని కమీషన్‌గా ఇచ్చేయాల్సి వస్తోంది. 10 శాతం మొత్తాన్ని ఒరిజినల్ కాంట్రాక్టర్లు తమ  దగ్గరే  ఉంచుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోని చిన్నతరహా కాంట్రాక్టర్ల జీవితం నరకప్రాయంగా మారింది” అనే ఆరోపణలతో  స్మాల్ అండ్ మీడియం రీజినల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ లెటర్ హెడ్ తో ఈ లేఖ ఉంది. ఈ  వివాదాస్పద లేఖ చివరిలో జ్ఞానేంద్ర అవస్థి  అనే పేరు రాసి ఉంది. మధ్యప్రదేశ్  హైకోర్టు గ్వాలియర్ బెంచ్ ప్రధాన న్యాయమూర్తికి..  చిన్న, మధ్య తరహా ప్రాంతీయ కాంట్రాక్టర్ల సంఘం తరఫున ఫిర్యాదు చేసినట్టుగా ఈ లేఖలోని వివరాలు ఉన్నాయి. ఇక ఇదే లేఖను ప్రియాంకాగాంధీ, కమల్ నాథ్, అరుణ్ యాదవ్, జైరాం రమేష్‌ తాజాగా ట్విట్టర్ లో శుక్రవారం సాయంత్రం షేర్ చేస్తూ.. మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం 50% కమీషన్ ప్రభుత్వమని ఆరోపించారు.

Also read : Weekly Horoscope : ఆగస్టు 13 నుంచి 19 వరకు వార ఫలాలు.. వారికి శత్రుదోషం

ప్రియాంకా గాంధీ ట్వీట్‌లో ఏం రాశారు ?

ఈ లెటర్ తో పాటు శుక్రవారం సాయంత్రం ప్రియాంక గాంధీ(FIR On Priyanka Gandhi) ట్వీట్ చేస్తూ..  “50% కమీషన్ చెల్లించిన తర్వాతే బిల్లుల పేమెంట్స్ అందుతున్నాయని  ఫిర్యాదు చేస్తూ మధ్యప్రదేశ్‌లోని కాంట్రాక్టర్ల యూనియన్  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది. గతంలో కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం 40% కమీషన్ వసూలు చేసేది. మధ్యప్రదేశ్‌లోని  బీజేపీ సర్కారు ఆ అవినీతి రికార్డును బద్దలు కొట్టింది.  40 శాతం కమీషన్‌ ప్రభుత్వాన్ని కర్ణాటక ప్రజలు ఇప్పటికే గద్దె దించారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రజలు 50% కమీషన్‌ కోసం నడుస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగిస్తారు” అని పేర్కొన్నారు.

బీజేపీ ఏమంటోంది ? 

అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి  తప్పుడు  లెటర్ ను షేర్ చేసి ప్రియాంకాగాంధీ  ప్రజలను తప్పుదారి పట్టించారని బీజేపీ లీగల్ సెల్ నాయకుడు నిమేష్ పాఠక్ ఆరోపించారు. “కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుడు లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు.  ఈ సైబర్‌ క్రైమ్‌పై బీజేపీ గట్టి చర్యలు తీసుకుంటుంది” అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ చెప్పారు.

Exit mobile version