పార్లమెంట్ ఆవరణలో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీ ఎంపీల మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా తమపై దాడి జరిగింది అని ఆరోపిస్తూ, బీజేపీ ఎంపీలు లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదయ్యింది.
బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ నాకు ఉద్దేశపూర్వకంగా నెట్టాడని” తెలిపారు. ఈ క్రమంలో, ప్రతాప్ సారంగి గాయపడటంతో, పార్లమెంట్ భద్రతా సిబ్బంది ఆయనను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు, ఈ ఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు. పార్లమెంట్ ఆవరణలో విలేకర్లతో మాట్లాడిన ఆయన, “పార్లమెంట్ లోకి వెళ్లేందుకు నేను ప్రయత్నించాను. అయితే బీజేపీ ఎంపీలు నాకు అడ్డు తగిలి, నన్ను లోపలికి వెళ్లనీయకుండా ఆపారు. ఆ సమయంలో నేను నెట్టివేశాను” అని తెలిపారు.