Case On RGV: ఆర్జీవీపై చీటీంగ్ కేసు న‌మోదు చేసిన హైద‌రాబాద్ పోలీసులు…?

ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌పై హైద‌రాబాద్ లో చీటింగ్ కేసు న‌మోదు అయింది. ప్రొడక్షన్ హౌస్‌ను రూ.56 లక్షల మేర మోసం చేశారన్న ఆరోపణలపై ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Written By:
  • Publish Date - May 24, 2022 / 12:15 PM IST

ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌పై హైద‌రాబాద్ లో చీటింగ్ కేసు న‌మోదు అయింది. ప్రొడక్షన్ హౌస్‌ను రూ.56 లక్షల మేర మోసం చేశారన్న ఆరోపణలపై ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. శేఖర ఆర్ట్ క్రియేషన్స్‌కు చెందిన కొప్పాడ శేఖర్ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

దిషా చిత్రాన్ని నిర్మించడం కోసం వర్మ తన నుండి డబ్బు అప్పుగా తీసుకున్నాడని, ఆ సినిమా విడుదలకు ముందు దానిని తిరిగి ఇస్తానని హామీ ఇచ్చాడని ఫిర్యాదుదారుడు ఆరోపించాడు. 2019లో హైదరాబాద్‌కు సమీపంలో వెటర్నరీ డాక్టర్‌పై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి, ఆ తర్వాత ఆరోపించిన ఎన్‌కౌంటర్‌లో పోలీసులు చంపిన సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. కొన్నేళ్ల క్రితం రమణారెడ్డి అనే కామన్ ఫ్రెండ్ ద్వారా వర్మతో పరిచయం ఏర్పడిందని రాజు పోలీసులకు తెలిపాడు.2020 జనవరిలో రూ.8 లక్షలు, కొన్ని రోజుల తర్వాత మరో రూ.20 లక్షలు ఇచ్చారని ఫిర్యాదుదారు పేర్కొన్నాడు. డ‌బ్బు మొత్తాన్ని ఆరు నెలల్లో తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చాడ‌ని.. అయితే ఫిబ్రవరి 2020లో తనను ఆర్జీవీ సంప్రదించారని, ఆర్థిక సమస్యల కారణంగా మరో రూ.28 లక్షలు అప్పుగా తీసుకున్నారని రాజు చెప్పారు.తీసుకున్న డ‌బ్బు ఇంత‌వ‌ర‌కు చెల్లిచ‌క‌పోవ‌డంతో తాను పోలీసుల‌ను ఆశ్ర‌యించాన‌ని పిర్యాదుదారుడు తెలిపారు.