Site icon HashtagU Telugu

Suicide Case: వ్యక్తి ఆత్మహత్య కేసులో మంత్రిపై ఎఫ్‌ఐఆర్‌…

Suicide Case

New Web Story Copy (4)

Suicide Case: వ్యక్తి మృతికి కారణమైన ఓ మంత్రిపై పోలీస్ కేసు నమోదైంది. అతనితో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు స్థానిక పోలీసులు. ఓ వ్యక్తి ఆత్మహత్య ఘటనపై రాజస్థాన్‌ కేబినెట్‌ మంత్రి మహేశ్‌ జోషితో పాటు, మరి కొంతమందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. 38 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఓ వీడియో ఆధారమైంది.

రాజస్థాన్ లో 38 ఏళ్ళ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. రామ్ ప్రసాద్ అనే వ్యక్తి చనిపోయే ముందు ఒక వీడియో బయటపెట్టాడు. తన భూమికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నప్పటికీ, ఇల్లు నిర్మించడానికి అనుమతించడం లేదని అతను చెప్పాడు. ఒత్తిడి కారణంగా నా తల్లి గులాబీ దేవి, భార్య సుమన్ మీనా అనారోగ్యానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశాడు.ఎక్కడికక్కడ ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయాడు. నా కుటుంబానికి న్యాయం చేయాలని ఎంపీ కిరోరి లాల్ మీనాను అభ్యర్థిస్తున్నాను అని ఆయన తన వీడియోలో పేర్కొన్నారు. స్థానిక హనుమాన్ మందిర్ సమీపంలో రామ్ ప్రసాద్ నివాసం ఉంటున్నాడు. అయితే అతని భూమికి సంబంధించి వివాదం నడుస్తోంది. మృతుడు తనకున్న భూమిలో ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. అయితే మంత్రితో పాటు కొందరు వ్యక్తులు తన భూమిపై కన్నేశారు. ఈ నేపథ్యంలో తనను ఇల్లు కట్టకుండా పదే పదే వేధిస్తున్నట్టు తెలిపాడు. భూమికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నట్టు రామ్ ప్రసాద్ వీడియోలో తెలిపాడు.

కేబినెట్‌ మంత్రి మహేశ్‌ జోషితో పాటు దేవేంద్ర శర్మ, లలిత్‌ శర్మ, హోటల్‌ రాయల్‌ షెరటన్‌ యజమాని ముంజ్‌ ట్యాంక్‌, దేవ్‌ అవస్థి, లాల్‌చంద్‌ దేవ్‌నానీలు తన కుటుంబాన్ని ఎంతగానో వేధించారని ఆరోపిస్తూ ఆత్మహత్యకు ముందు మృతుడు రాంప్రసాద్‌ వీడియో రికార్డు చేశాడు. ఆ వీడియో పోలీసులకు దొరకడంతో వీడియోలో పేర్కొన్న సదరు వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు సోమవారం రాత్రి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు సుభాష్‌చౌక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో రామ్‌ఫూల్‌ మీనా తెలిపారు. ఇందులో ఓ ఎమ్మెల్యే పేరు కూడా ఉన్నందున మొత్తం వ్యవహారంపై సీఐడీ, క్రైం బ్రాంచ్‌తో విచారణ జరిపిస్తామని అధికారి తెలిపారు.

Read More: Business Idea : 10లక్షల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే..ప్రభుత్వం 75 శాతం నిధులు ఇస్తుంది. ప్రతినెలా మంచి ఆదాయం ఉంటుంది.