Metro Pillars: మెట్రో పిల్లర్‌పై పోస్టర్‌ వేస్తే జైలుకే.!

హైదరాబాద్‌లో మెట్రో రైల్‌ పిల్లర్లపై ఇకపై పోస్టర్‌ పడితే చాలు ఆ పోస్టర్‌ వేసిన వారికి రంగు పడుద్ది.అదేంటి మెట్రో పిల్లర్‌పై పోస్టర్‌ వేస్తే రంగు పడడమేంటి అనుకుంటున్నారా?

Published By: HashtagU Telugu Desk
Metro Pillars Imresizer

Metro Pillars Imresizer

హైదరాబాద్‌లో మెట్రో రైల్‌ పిల్లర్లపై ఇకపై పోస్టర్‌ పడితే చాలు ఆ పోస్టర్‌ వేసిన వారికి రంగు పడుద్ది.అదేంటి మెట్రో పిల్లర్‌పై పోస్టర్‌ వేస్తే రంగు పడడమేంటి అనుకుంటున్నారా? హైదరాబాద్‌ మెట్రో పిల్లర్లపై అనుమతి లేని పోస్టర్ల వేయడం చట్ట విరుద్ధమని, అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి. హైదరాబాద్ మెట్రో పిల్లర్లపై రాజకీయ నాయకులు పోస్టర్లు వేస్తున్నారు.ఇక నుంచి కఠినంగా వ్యవహరిస్తాం.

సెంట్రల్ మెట్రో రూల్స్ అమలు చేస్తాం. పోస్టర్లు వేస్తే వెయ్యి రూపాయల ఫైన్ వేయడంతో పాటు ఆరు సంవత్సరాలు జైల్లో పెడతామని హెచ్చరించారు.. గల్లీ లీడర్లు ఈ పోస్టర్లు ఎక్కువగా వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్వీఎస్‌ రెడ్డి. మెట్రో పిల్లర్లపై అడ్డగోలుగా పోస్టర్లు వేసి హైదరాబాద్ నగరం బ్రాండ్ పాడు చేయొద్దని విజ్ఞప్తి చేసిన ఆయన హైదరాబాద్ లో ఉండే వాళ్లకి నాలుగు ఏళ్ళు ఆయుష్షు తగ్గిపోతుంది. కాలుష్యం వల్ల ఇలా జరుగుతుంది.

కాలుష్యం లేని జర్నీ కోసం హైదరాబాద్ లో మెట్రో రైళ్లు ఉపయోగ పడుతున్నాయని, ఇప్పటి వరకు వన్ మిలియన్ రైడ్స్ పూర్తి అయ్యాయని తెలిపారు. కాగా, హైదరాబాద్‌ మెట్రో రైలుకు పిల్లర్లు భారీగా ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి ప్రభుత్వ పథకాలు.వివిధ కంపెనీలు ఇచ్చే యాడ్స్‌ తో మెట్రోకు ఆదాయం వస్తుంది.అయితే, కొందరు యాడ్స్‌ ఇస్తే, మరికొందరు ఇష్టానుసారంగా పోస్టర్లు, బ్యానర్లు కట్టడం ఇబ్బందిగా మారుతుందట. ఇది మెట్రో రైల్‌ యాజమాన్యం దృష్టికి రావడంతో కఠిన చర్యలకు తీసుకునేందుకు సిద్ధం అవుతుంది. అందులో భాగంగానే ముందుగా మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి హెచ్చరించినట్టుగా తెలుస్తోంది.

  Last Updated: 22 Sep 2022, 08:55 PM IST