Site icon HashtagU Telugu

Sitiveni Rabuka: మొబైల్ ఫోన్ పై మోజు.. మెట్ల మీద నుంచి జారిపడిన ప్రధాని?

Sitiveni Rabuka

Sitiveni Rabuka

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో స్మార్ట్ ఫోన్ ల వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. ఇంకొందరు అయితే ఈ మొబైల్ ఫోన్ ల పిచ్చిలో పడి మొబైల్ ఫోన్ లు చూస్తూ ఎక్కడ ఉన్నాము ఏం చేస్తున్నాం అన్నది కూడా మర్చిపోతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు అతిగా మొబైల్ ఫోన్ని చూస్తూ ఉండడం వల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరగవచ్చు. తనకు కూడా అటువంటి ఊహించని యాక్సిడెంట్ ఒకటి జరిగిందని ఒక ప్రధాని చెప్పుకొచ్చారు.

సాక్షాత్తూ ఫిజీ ప్రధానమంత్రి సితివేణి రబుకా సైతం ఈ మొబైల్ ఫోన్ మోజులో పడి, మెట్ల మీద నుంచి జారిపడ్డారట. సెల్‌ఫోన్ చూస్తూ నడిచిన ఆయన మెట్లు దిగడాన్ని గమనించలేదట. దాంతో జారి కింద పడ్డారట. ఆ ప్రమాదంలో ఆయన తలకు దెబ్బతగిలింది. దీంతో తన చైనా పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారట. అయితే ఇదే ఈ విషయాన్ని ఫిజీలోని చైనా రాయబార కార్యాలయంతో పాటు స్వయంగా ప్రధాని రబుకా వెల్లడించారు. తనకు ఎదురైన ఈ ఘటనపై ప్రధాని రబుకా ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆయన ఫోన్ చూస్తుండగా జారిపడ్డానని, ఫలితంగా తలకు గాయమైందని, దీంతో చైనా పర్యటనని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని అన్నారు.

బుధవారం ఉదయం ప్రభుత్వానికి చెందిన కొత్త బిల్డింగ్‌ ప్రవేశ ద్వారం వద్ద నేను మొబైల్‌ చూస్తూ పొరపాటున మెట్లు జారి కిందపడ్డాను. ఈ ప్రమాదంలో తలకు గాయమైంది. దీంతో నా సిబ్బంది నన్ను ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందించారు. ఇప్పుడే నేను ఆసుపత్రి నుంచి తిరిగొచ్చాను అని రబుకా ఆ వీడియోలో తెలిపారు. ఈ వీడియోలో ఆయన చొక్కాపై కొద్దిగా రక్తపు మరకలు ఉండటాన్ని గమనిస్తే ఆయనకు గట్టిగానే దెబ్బ తగిలినట్టు తెలుస్తోంది.