Bhopal: నిండు పాణాలు బలిగొన్న కుక్కల గొడవ.. అసలేం జరిగిందంటే?

మనుషుల్లో మానవత్వం అన్నది కరువైపోయింది. చాలామంది చిన్న చిన్న విషయాలకి కోపంతో ఊగిపోయి చావడం ఎదుటి వ్యక్తిని చంపడం వరకు కూ

Published By: HashtagU Telugu Desk
Bhopal

Bhopal

మనుషుల్లో మానవత్వం అన్నది కరువైపోయింది. చాలామంది చిన్న చిన్న విషయాలకి కోపంతో ఊగిపోయి చావడం ఎదుటి వ్యక్తిని చంపడం వరకు కూడా వెళ్తున్నారు. కొంతమంది అతి కిరాతకంగా ఎదుటి వ్యక్తులను చంపడం లాంటివి కూడా చేస్తున్నారు. నిత్యం సమాజంలో ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా కూడా భోపాల్ లో అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. రెండు కుక్కల కోసం ఇద్దరు వ్యక్తులు ఒక గొడవ పడి చివరికి ఒకరు మృతి చెందారు. అసలేం జరిగిందంటే..

ఇండోర్ కృష్ణ బాగ్ కాలనీలో రాత్రి 11 గంటలకు ఒక ఇరుకైన సందులో రజావత్, విమల్ అచల్ ఇద్దరూ తమ పెంపుడు కుక్కలతో వాకింగ్ చేయడానికి బయటకు వచ్చారు. ఆ సమయంలో రెండు కుక్కలు ఎదురుపడేసరికి పెద్దగా మొరుగుతూ తగువుకు దిగాయి. వాటికంటే గట్టిగా అరుపులతో రజావత్, అచల్ గొడవపడ్డారు. అంతలో ఏమైందో రజావత్ ఆగ్రహంతో పక్కనే ఉన్న బిల్డింగ్ మొదటి అంతస్తులోని తన ఇంటిలోకి ఆవేశంగా వెళ్లి బాల్కనీలోకి వచ్చి 12-బోర్ రైఫిల్ తో కాల్పులు జరిపాడు. కాల్పుల్లో అచల్ అక్కడికక్కడే చనిపోయాడు. అతడితో పాటు అక్కడే ఉన్న మరో వ్యక్తి రాహుల్ వర్మ కూడా ప్రాణాలు కోల్పోయాడు. మరో ఆరుగురికి బులెట్ గాయాలయ్యాయి.

రజావత్ కు గన్ లైసెన్స్ ఉన్నందున అతడిని ఒక ప్రయివేట్ కంపెనీ సెక్యూరిటీ గార్డుగా నియమించింది. మృతుడు అచల్ కు కటింగ్ షాపు ఉంది. రజావత్ క్షణికావేశంలో చేసిన పొరపాటుకు రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు రజావత్ ను, అతడి కుమారుడిని, వారి బంధువు శుభంను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రెండు కుక్కలు అరుచుకున్నందుకుగాను క్షణాల్లోనే మాట్లాడుకోవడం గన్ తో షూట్ చేసుకోవడం చనిపోవడం అన్ని జరిగిపోయాయి.

  Last Updated: 18 Aug 2023, 03:50 PM IST